మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో కంగనా రనౌత్ భేటీ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వం తన పట్ల అమానుషంగా వ్యవహరించిన తీరును గవర్నర్కు వివరించానని, సమాజంలో యువతులు సహా పౌరులందరిలో విశ్వాసం బలపడేలా తనకు న్యాయం జరుగుతుందని గవర్నర్తో భేటీ అనంతరం కంగనా వ్యాఖ్యానించింది. ముంబైలో తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలదోయడంతో పాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి ఈ భేటీలో గవర్నర్కు ఆమె వివరించినట్టు తెలిసింది.