త్రివిక్రమ్, మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్నాడని గత రెండు రోజులగా వర్గాలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అంతేకాదు ఇప్పుడే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా వదిలేస్తున్నారు. అందులో ఒకటి మహేష్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సీతారామపురం అనే పేరుతో ఓ పోస్టర్ ను ఎవరో సోషల్ మీడియాలో వదిలారు. విదేశాలు వదిలి, పల్లెటూరుకొచ్చిన ఓ హీరో కథ అంటూ.. పోస్టర్లోనే కథంతా చెప్పే ప్రయత్నం చేశారు.