ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి అక్టోబర్ 5నుంచి షూటింగ్ మొదలవుతుందని అధికారిక సమాచారంగా తెలుస్తోంది. గతంలో ఓసారి టెస్ట్ షూట్ చేసి ఇబ్బందులు పడ్డ దర్శకుడు రాజమౌళి ఈసారి పగడ్బందీగా సెట్లో అడుగుపెట్టబోతున్నారు. టాలీవుడ్ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పట్టాలెక్కబోతున్న నేపథ్యంలో.. ఆర్ఆర్ఆర్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో ముందు ఓ డేట్ అనౌన్స్ చేయడం రాజమౌళికి కంపల్సరిగా మారింది. అందుకే అక్టోబర్-5 ని ఫిక్స్ చేశారు రాజమౌళి.