2002లో అంటే 18ఏళ్ల క్రితం నారా లోకేష్ వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యిందట. యూత్ ఫుల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న దర్శకుడు తేజ, లోకేష్ ని లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నారట. లోకేష్ హీరోగా ఓ రొమాంటిక్ లవ్ డ్రామా తెరకెక్కించాలని అనుకున్నారట.నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా అనుకోవడం హీరో అవ్వడానికి ఒప్పుకోక పోవడం వలనో,మరే ఇతర కారణం కావచ్చు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.