అల్లు అర్జున్ కుంటాల జలపాతం వద్దకు వచ్చినప్పుడు ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం చూపించారని, స్టార్ హీరో కావడం వల్లే వారికి రాచమర్యాదలు చేశారని, సగటు ప్రజల విషయంలో మాత్రం సవాలక్ష కండిషన్లు పెడతారని విమర్శించారు. దీంతో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఈ విమర్శలతో ఇబ్బంది పడ్డారట స్టైలిష్ స్టార్. తన ప్రైవేట్ టూర్ పై ఇన్ని విమర్శలు ఎందుకంటూ సన్నిహితుల వద్ద వాపోయారట.