కంగనాకు ప్రముఖులకు కేటాయించే "వై ప్లస్" కేటగిరి భద్రత కల్పించాడని చాలా మంది తప్పుబట్టారు. ముఖ్యంగా శివసేన నేతలు ఆమెకు కేంద్రం అంత ప్రాధాన్యం ఇవ్వడాన్ని విమర్శించారు. తాజాగా సుప్రీం కోర్ట్ న్యాయవాది "బ్రిజేష్ కలప్ప" కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్షల ఖర్చుతో కంగనా రనౌత్ కి వై ప్లస్ కేటగిరి ఎలా కల్పిస్తారని ఆయన నిలదీశారు.