కరోనానుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తానని ప్రకటించారు మెగా బ్రదర్ నాగబాబు. ‘వైరస్ అనేది ప్రతిసారీ మనల్ని బాధకు గురి చేసేది కాదు, ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని కూడా కల్పించేది అవుతుంది. కరోనా పాజిటివ్ అని తేలింది. దీన్ని తట్టుకుని నిలబడి ప్లాస్మా దానం చేయాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.