కుంటాల జలపాతం వద్దకు అల్లు అర్జున్ విహార యాత్రకు వెళ్లలేదని, పుష్ప షూటింగ్ కోసం వెళ్లారని మరో వాదన వినిపిస్తోంది. హీరో అల్లు అర్జున్ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుని పోలీసులు తీసుకున్నా.. కేసు నమోదు చేయలేదు. ప్రాథమిక విచారణ తర్వాతే కేసు నమోదు చేస్తామని తెలిపారు పోలీసులు.