నిజానికి ‘నేను శైలజ’ కీర్తి సురేష్ మొదటి సినిమా కాదు. ‘ఐనా ఇష్టం’ నువ్వు అనే చిత్రం కీర్తి సురేష్ మొదటి సినిమా..! ‘ఫ్రెండ్లీ మూవీస్’ బ్యానర్ పై అడ్డాల చంటి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రాంప్రసాద్ రగటు డైరెక్టర్. సీనియర్ నటుడు అయినా నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ఇందులో హీరో గా నటించాడు. నిజానికి 2015 లేదా 2016లో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం.. షూటింగ్ చివరి దశలో ఉండగా కొన్ని ఆర్ధిక సమస్యల వచ్చి ఆగిపోయింది. అప్పటి నుండీ ఈ చిత్రం విడుదల కాలేదు. ఇప్పుడు కీర్తి సురేష్ పెద్ద స్టార్ అయ్యింది కాబట్టి.. ఈ చిత్రాన్ని ఓటిటిలో అయినా విడుదల చేస్తే క్యాష్ చేసుకోవచ్చు అని నిర్మాత ప్లాన్ చేసాడు.