ఈనెల 23నుంచి రంగ్ దే చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలవుతుంది. దీనికోసం ఇప్పటికే దర్శక నిర్మాతలు సిద్ధమైపోయారు. హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ కూడా షూటింగ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. హీరో నితిన్ హైదరాబాద్ లో షూటింగ్ పూర్తైన తర్వాత ఇంటికెళ్లినా ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకున్నారట. షూటింగ్ పూర్తయ్యే వరకు ఔట్ హౌస్ లోనే ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయ్యారట. సినిమా పని పూర్తయ్యక కరోనా లక్షణాలేవీ లేకపోతేనే ఇంట్లో అడుగు పెడతారట నితిన్.