వ్యాయామాలతో ఏ వయసులోనైనా ఆరోగ్యం గా ఉండ వచ్చని నిరూపించాడు జి.కె.రెడ్డి. ఇతని ఫిట్నెస్ కు కారణం ఏంటి? అని సందేహ పడేవారికి కొన్ని వర్కౌట్లు చేస్తూ.. జవాబిచ్చాడు. ‘కరోనా భయంకరంగా విజృంభిస్తున్న తరుణంలో బయటికి ఎక్కువగా వెళ్ళడం మంచిది కాదు.కానీ ఇంట్లో ఉండి కూడా ఫిట్ నెస్ ను కాపాడుకోవచ్చు. అతి తేలికైన ఈ వ్యాయామాలే ఆరోగ్యంగా ఉంచుతాయి, వీటిని రోజూ చేస్తే ఏ వయసులో అయినా ఫిట్ గా ఉండొచ్చు’ అంటూ ఆ వ్యాయామాలను చేసి చూపించారు జి.కె.రెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.