హీరో సూర్య వ్యాఖ్యలపై హైకోర్టు స్పందించింది. సూర్య వ్యాఖ్యలు అనవసరమైన, సమర్థించదగ్గవి కాదని పేర్కొంది. అయితే కరోనా విపత్కర, క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తోందని చెన్నై హైకోర్టు వెల్లడించింది. తమ పనితీరును తక్కువ చేసి మాట్లాడటం తగదని సూర్యకు హితవు పలికింది. అదే సమయంలో సూర్యపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది.