కేవలం సినిమాలకోసమే తాను ఒకటి రెండు సార్లు స్మోకింగ్ సీన్స్ లో యాక్ట్ చేశానని, నిజ జీవితంలో తనకు స్మోక్ చేసే అలవాటే లేదని కోర్టుకి సమర్పించిన పిటిషన్లో పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్. అలాంటి తనకు డ్రగ్స్ కేసు అంటగట్టారని వాపోయింది. సినిమా షూటింగ్ కోసం ఎప్పుడైనా స్మోక్ చేయాల్సి వస్తే చేసి ఉంటానని, తెరపై సన్నివేశాలలో మినహా వ్యక్తిగత జీవితంలో తాను ఎప్పుడూ పొగ త్రాగలేదని స్పష్టం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కేవలం యోగాతోనే తన ఫిట్ నెస్ కాపాడుకుంటానని చెప్పింది.