పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాా వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా లో పవర్ స్టార్ లాయర్ గా కనిపించబోతున్నాడు. పవన్ కి జోడిగా తమన్నా నటిస్తుంది. అంతేకాదు ఆమెతో పాటు నివేదా థామస్, అంజలీ కూడా ఈ సినిమా లో కీలకమైన పాత్ర లు పోషిస్తున్నారు. ఇక ఇప్పడు తాజాగా ఈ సినిమాకు సంబందించి ఓ వార్త ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు 100 కోట్ల డిజిటల్ ఆఫర్ వచ్చిందట. అయినా కూడా నిర్మాత దిల్ రాజు పక్కన పెట్టారనే వార్త వినిపిస్తోంది.