‘జబర్దస్త్’ షోలో పాల్గొనే నటీనటులందరితో ‘మల్లెమాల’ వారు బాండ్ రాయించుకుంటారట. అది బ్రేక్ చేసి వేరే షోకి వెళ్లాలంటే ఫైన్ కట్టి వెళ్ళాలట. దీంతో ముక్కు అవినాష్ వారితో భేరాలు ఆడటానికి ఎక్కువ టైం పట్టినట్టు తెలుస్తుంది.ఫైనల్ గా 10 లక్షలు ఫైన్ కట్టి.. ‘బిగ్ బాస్4’ కు ఎంట్రీ ఇచ్చాడట అవినాష్. ‘బిగ్ బాస్4’ కు గాను అవినాష్ కు వారానికి 5లక్షల వరకూ పారితోషికం అందుతుందట. షోలో కనుక అతను 10వారాల పాటు కొనసాగితే కనుక అవినాష్ కు 50 లక్షలు వరకూ దక్కుతుంది. ఒకవేళ వెంటనే ఎలిమినేట్ అయిపోతే కనుక.. తిరిగి ‘జబర్దస్త్’ కు వెళ్లి తన ప్రయాణాన్ని కొనసాగించుకోవచ్చు.