ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్న ఒక క్రేజీ ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ అయితే సెట్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ సినిమాలు పూర్తి అయిన వెంటనే ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ పరిశ్రమలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మిస్సైల్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ మాఫియా డాన్ పాత్ర చేయనున్నారట. ప్రపంచాన్నే గడగడలాడించే మాఫియా లీడర్ గా ఎన్టీఆర్ ని ఆయన ప్రెజెంట్ చేయనున్నారట.