మంచు ఫ్యామిలీ హీరోలు విష్ణు, మనోజ్, ఓటీటీ ప్లాట్ ఫామ్ పై అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే మంచు లక్ష్మి ఓటీటీకోసం ప్రత్యేక కార్యక్రమాలు రెడీ చేస్తుండగా.. ఆమె సోదరురిద్దరూ ఓటీటీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మంచు విష్ణు నిర్మాతగా త్వరలో ఓ వెబ్ సిరీస్ మొదలు కానుంది.