బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా.. ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నా ప్రయోజనం లేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీలోనే అందివచ్చిన అవకాశాలను వదిలిపెట్టకుండా చేస్తోందట. దీనికోసం రెమ్యునరేషన్ తగ్గించుకోడానికి సైతం సిద్ధపడిందట తమన్నా. అంధా ధూన్ రీమేక్ సినిమాలో ఇలా పారితోషికం తగ్గించుకోవడం వల్లే అవకాశం పట్టేసిందట తమన్నా.