‘స్పోక్స్ మై హార్ట్ ఔట్’ అనే పేరుతో ఓ వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేసింది వితిక. ఆమె మాట్లాడుతా.. “బిగ్బాస్ సీజన్ తరువాత నేను ఎంతటి మానసిక క్షోభను ఎదుర్కున్నానో నాకు తెలుసు. ‘బిగ్ బాస్’ షోలో మంచి ఉంది.. అలాగే చెడు కూడా ఉంది. హౌస్లో 24 గంటలు గడిపే కంటెస్టెంట్ల జీవితాన్ని గంట మాత్రమే చూపించి క్యారెక్టర్లని డిసైడ్ చేస్తుంటారు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు చేసేది.. చూసే వాళ్లకు చాలా అతిగా అనిపిస్తోంది. అది నటన అని కూడా వారు అనుకుంటున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు నా పై కూడా సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.అవి చూసిన నా ఫ్యామిలీ ఎంతో మానసిక క్షోభననుభవించింది. బయటకు వచ్చాక నేను కూడా చాలా బాధపడ్డాను. అలాంటి టైములో నా కుటుంబం నాకు అండగా నిలబడింది” అంటూ చెప్పుకొచ్చింది.