కుమార్ సాయి, గంగవ్వ పోటీపడ్డారు. ‘పైసా వసూల్’ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు వీరిద్దరూ బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. గంగవ్వ మంచి హుషారుగా డ్యాన్స్ చేశారు. నాలుక మడతపెట్టి కుమార్ సాయితో పోటీగా స్టెప్పులేశారు. నాగార్జునతో పాటు హౌజ్‌లో ఉన్నవాళ్లంతా గంగవ్వ డ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేసిన గంగవ్వ.. ఆఖరులో ఆ బోన్ అందుకుని కుమార్ సాయిని పరుగులు పెట్టించారు. మొత్తం మీద బాలయ్య పాటకు గంగవ్వ డ్యాన్స్‌తో దుమ్ముదులిపారు.