లాక్ డౌన్ కాలాన్ని అత్యంత సమర్థంగా ఉపయోగించుకున్న హీరోలు ప్రభాస్, పవన్ కల్యాణ్. వర్సబెట్టి సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రభాస్, పవన్ కంటే ఎక్కువగా నాగ చైతన్య సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం చైతన్య చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇవి కాకుండా మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.