డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న హీరోయిన్ సంజనకు సంబంధించిన మరో విషయం సెన్సేషన్ గా మారింది. రెండేళ్ల క్రితం సంజన మతం మారిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇస్లాంలోకి మారిన తర్వాత సంజన తన పేరును మహిరాగా మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.