హీరోని రాజమౌళి మూవీ తరువాత ప్లాప్ పేస్ చేయాలనే సెంటిమెంట్ తప్పకుండా ఫాలో అయ్యింది. ఒక్క ప్రభాస్ విషయంలో అది కూడా సాహూ మూవీ విషయంలో ఇది ఫెయిల్ అయ్యింది. బాహుబలి తరువాత ప్రభాస్ సాహో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఐతే తెలుగుతో పాటు సౌత్ భాషలలో సాహో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, భారీ వసూళ్లు దక్కించుకుంది. ఐతే మూవీ అధిక ధరలకు అమ్మిన నేపథ్యంలో కొన్ని చోట్ల నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్ లో సాహో సూపర్ హిట్ గా నిల్చింది. 150కోట్లకు పైగా వసూళ్లతో బయ్యర్లకు లాభాలు పంచింది. ఒక రకంగా చూసుకంటే ఈ నేపథ్యంలో రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ని ఎదుర్కొన్న ఏకైన హీరో ప్రభాస్ అని చెప్పాలి.