సూర్య కిరణ్ వ్యవహారం కల్యాణికి తలనొప్పిగా మారింది. ఆ వ్యక్తిగత జీవితం ఏమిటనేది ప్రేక్షకులు ఎప్పుడో మరచిపోయారు. దాదాపు వీరిద్దరూ విడిపోయి 9ఏళ్ళు అవుతుండగా ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి విషయాలు తెరపైకి రావడం ఆమెను ఇబ్బంది పెడుతుంది. మీడియా సైతం సూర్య కిరణ్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రోజుకు అనేక కథనాలు వీరి బంధంపై వస్తున్నాయి.