రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవల తన ఫిట్నెస్ ట్రైనర్ అయినా లక్ష్మణ్ రెడ్డి కి 85 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న నితిన్ కు ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. అందుకేనేమో నితిన్ … ఇతనికి రూ.85లక్షల విలువగల రేంజ్ రోవర్ కారుని ప్రెజెంట్ చేసాడు.‘ఛలో’ చిత్రం సూపర్ హిట్ అయ్యాక తన పేరెంట్స్ కు 1.25 కోట్ల విలువ గల పోర్స్చే 718 సైమన్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు నాగశౌర్య.చిరంజీవి 59వ పుట్టినరోజుకి గాను 1.25 కోట్ల విలువగల ల్యాండ్ క్రూజర్ వి8 కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు చరణ్.చిరంజీవి 59వ పుట్టినరోజుకి గాను 1.25 కోట్ల విలువగల ల్యాండ్ క్రూజర్ వి8 కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు చరణ్.మహేష్ బాబు 35వ పుట్టినరోజు సంధర్భంగా నమ్రత 1.5 కోట్ల విలువగల రేంజ్ రోవర్ వోగ్ కారుని ప్రెజెంట్ చేసింది.‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి ‘శ్రీమంతుడు’ వంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను అందించాడు దర్శకుడు కొరటాల శివ. అందుకు గాను మహేష్ బాబు 2015 లో 50 లక్షల విలువగల ‘న్యూ ఆడి ఎ6’ కారుని కొరటాలకు బహుమతిగా అందించాడు.ఈ విధంగా నటులు తమ సన్నిహితులకు కృతజ్ఞతగా ఇలా కార్లు బహుమతులుగా ఇచ్చారు.