అల్లు అర్జున్ కుంటాల జలపాతం వద్ద షూటింగ్ లో పాల్గొన్నారంటూ ఫిర్యాదు చేసిన వారితో గీతా ఆర్ట్స్ సిబ్బంది మాట్లాడారట. ఈ వ్యవహారాన్ని అక్కడితో ఆపేయాలని, పెద్దది చేయొద్దని కోరారట. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారట. దీంతో ఈ కేసు వ్యవహారం అటకెక్కేసిందని అంటున్నారు. పోలీసులుకు వారిచ్చిన ఫిర్యాదు కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉందట.