మెహ్రీన్ మాట్లాడుతూ.. “జీవితంలో ప్రతీ ఒక్కరు కొన్ని సందర్భాల వల్ల డిప్రెషన్ కు లోనవుతుంటారు. నేను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను. అయితే దాని నుండీ ఎంత త్వరగా బయటపడ్డామన్నదే చాలా ముఖ్యం.దానికి ముందు చెయ్యాల్సిన పనులు ..ముందుగా మనల్ని మనం నమ్మాలి, అలాగే దేవుడ్ని కూడా నమ్మాలి.అందరికీ జీవితం ఒక్కటే..! అది చాలా అందమైనదని గుర్తుంచుకోవాలి. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలి.ఇవి పాటిస్తేనే డిప్రెషన్ నుండీ త్వరగా బయటపడగలము. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మానవ జాతి మొత్తం డిప్రెషన్ ను ఫేస్ చేస్తుందన్న నిజాన్ని కూడా అందరూ గుర్తించాలి” అంటూ చెప్పుకొచ్చింది మెహ్రీన్.