లాక్ డౌన్ తర్వాత వకీల్ సాబ్ చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అంజలితో పాటు మిగిలిన ముఖ్య నటీనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే నెలలో షూటింగ్ కి హాజరవుతారట. అప్పుడు మొదలయ్యే షెడ్యూల్లోనే శ్రుతిహాసన్ పాల్గొంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను రెడీ చేయాలనుకుంటున్నారు.