రేణు దేశాయ్ 2012లో పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పుడు కూడా రేణు దేశాయ్ నటనపై ఆసక్తి చూపలేదు. సడన్ గా ఆమెకు యాక్టింగ్ పై ఆసక్తి కలిగింది. ఈ మధ్య అనేక సంధర్భాలలో ఎటువంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధం అని చెప్పారు. ఎట్టకేలకు ఆమె కోరిక ఫలిస్తూ ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేశారు. కాగా రేణు దేశాయ్ ప్రకటనపై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. పవర్ స్టార్ తో రేణు దేశాయ్ విడిపోయినప్పటికీ ఆమె వ్యక్తిగత విషయాలలో పవన్ ఫ్యాన్స్ కలుగజేసుకుంటూ ఉంటారు. గతంలో అనేక విషయాలలో ఇది జరిగింది. రేణు దేశాయ్ పెళ్లి ప్రకటన విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత రాద్ధాంతం చేశారో తెలిసిందే. ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా బెదిరించడం జరిగింది.