‘దూకుడు’ చిత్రానికి 35కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి 56.7 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం 105 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు సినిమాలలో మొదట 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ గా దూకుడు రికార్డు సృష్టించింది. దూకుడు మూవీ తరువాత రామ్ చరణ్ సినిమా "మగధీర", పవన్ కళ్యాణ్ సినిమా "గబ్బర్ సింగ్" 100 కోట్ల మార్కుని అందుకున్నాయి. నిజానికి మగధీర దూకుడు కంటే ముందే విడుదల అయినా కాని మగధీర ని దూకుడు తరువాత మళ్ళీ థియేటర్ లలో రిలీజ్ చేశారు. అందువల్ల మగధీర కూడా 100 కోట్ల మార్క్ అందుకుంది.