ప్రస్తుతం మరో మెగా హీరో కూడా వరుణ్ తేజ్ ని ఫాలో అవుతున్నాడు . చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇమేజ్ తెచ్చే పాత్రల కోసం చూడడం లేదు. సగటు కుర్రాడిని తలపించే పాత్రలే ఏరి కోరి ఎంచుకుంటున్నాడు. మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే క్రిష్‌తో సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రం కమర్షియల్ సినిమాలా కాకుండా ఆర్ట్ ఫిలిం తరహాలో వుంటుందని అంటున్నారు. వరుణ్ కూడా రెండవ సినిమా కంచె క్రిష్ డైరెక్షన్లోనే చేసాడు.ఆ సినిమాతోనే అతనికి హీరోగా ఐడెంటిటీ వచ్చింది.