తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మొన్నటివరకు ముంబయిలో ఉన్న రకుల్, మంగళవారమే హైదరాబాద్ వచ్చింది. బుధవారం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నోటీసులు ఇవ్వడంతో, విచారణకు హాజరయ్యేందుకు తిరిగి ముంబై వెళ్లిపోయింది. దీంతో క్రిష్ సినిమాకి బ్రేక్ పడింది. రకుల్ సినిమా కెరీర్ కూడా డైలమాలో పడ్డట్టేనని సినీ వర్గాలంటున్నాయి.