పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని నితిన్ సినిమా షూటింగ్ కి హాజరవుతారని అనుకున్నా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంటనే షూటింగ్ స్పాట్ లోకి వచ్చారు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న రంగ్ దే సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సెట్స్ పైకి వచ్చారు. నితిన్, ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలు తీశారు. షూటింగ్ స్పాట్ లో అందరూ మాస్క్ లు, ఫేస్ షీల్డ్ లు పెట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో నితిన్ మరింత సన్నగా కనిపిస్తున్నారు.