జెర్సీ హిందీ రీమేక్ లో చెప్పుకోదగ్గ విశేషాలున్నాయి. ఈ సినిమా కోసం షాహిద్ 35 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకోబోతున్నారట. అంతేకాదు సినిమాకు వచ్చే లాభంలో 20 శాతం వాటా కూడా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన పారితోషికం పెంచినట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ గతేడాది డిసెంబరులో మొదలైంది. లాక్ డౌన్ తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు.