నగ్మా  మాట్లాడుతూ.. “గతంలో నేను కూడా డ్రగ్స్ వాడానంటూ హీరోయిన్ కంగనా రనౌత్ డైరెక్ట్ గా చెప్పింది.. మరి ఆమెకు అధికారులు ఎందుకు నోటీసులు పంపలేదు.? కేవలం వాట్సప్ మెసేజ్లను ఆధారంగా చేసుకుని హీరోయిన్లకు నోటీసులు పంపిస్తున్నారు,మరి కంగనా డైరెక్ట్ గా ఒప్పుకున్నా ఆమెకు ఎందుకు నోటీసులు పంపలేదు.డ్రగ్స్ కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో హీరోయిన్లకు సంబంధం ఉన్నా లేకపోయినా నేషనల్ మీడియాలో వారి గురించి వార్తలు వచ్చేలా చేసి వారి పరువు తీయడమే ఎన్.సి.బి అధికారుల ఉద్యోగమా? ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు” అంటూ నగ్మా పెద్ద ఎత్తున మండిపడింది.