హిందీలో  సాహో భారీ విజయం దక్కించుకుంది. దానికి కారణం బాలీవుడ్ ప్రేక్షకులు ఆ తరహా చిత్రాలను యాక్సప్ట్ చేయగలరు. ఇప్పటికే ధూమ్ సిరీస్ క్రిష్ లాంటి చిత్రాలు అక్కడ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అదే తరహా స్క్రీన్ ప్లేతో గ్రాండ్ గా తెరకెక్కిన సాహో బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చింది. ప్రభాస్ ఇమేజ్ దృష్ట్యా ఒక తరహా కథలు, ఫార్మాట్ అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఆయన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. మరి ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో రాధే శ్యామ్ కూడా ప్రయోగాత్మక చిత్రమే అని తెలుస్తుంది. ఈ మూవీ ప్రభాస్ రెగ్యులర్ చిత్రాల మాదిరి అదిరిపోయే యాక్షన్, సాంగ్స్, డైలాగ్స్ కలిగి ఉండదట. ఎమోషన్స్ తో కూడిన సెన్సిబుల్ లవ్ స్టోరీ అని తెలుస్తుండగా, తెలుగులో వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీనితో సాహో మాదిరి రాధే శ్యామ్ బాలీవుడ్ లో హిట్టై, టాలీవుడ్ లో నిరాశపరుస్తుందా అనే అనుమానం కలుగుతుంది.