పెళ్లి కుమార్తె గెటప్ లోకి మారిపోయి ఒక్కసారిగా నెటిజన్లకు షాకిచ్చింది శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. జాన్వీ సడన్ గా వెడ్డింగ్ గౌన్ ఎందుకు వేసుకుంది? వెడ్డింగ్ జ్యుయలరీ ఎందుకు పెట్టుకుంది అనుకున్నారంతా..? అయితే ఇదంతా ఓ యాడ్ షూటింగ్ కోసం అని తేలడంతో అభిమానులు షాక్ నుంచి తేరుకున్నారు. బంగారు, ఆకుపచ్చ రంగు దుస్తులతో పాటు విలువైన ఆభరణాలను ధరించి మేలి ముసుగులో కనువిందు చేసిన జాన్వీ ఫొటోలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.