కొన్ని నెలల పాటు చిరు కోసం 'లూసిఫర్'ను వర్కవుట్ చేసే ప్రయత్నం చేశాడు సుజీత్. కానీ అతడి పనితనం నచ్చక చిరు పక్కన పెట్టినట్లు.. అతడి స్థానంలోకి వి.వి.వినాయక్ వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.ఐతే సుజీత్‌ను తాము తప్పించలేదని.. అతనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని చిరు చెప్పడం విశేషం.