ప్రపంచంలో వున్న అరుదైన గాయకుల్లో బాల సుబ్రహ్మణ్యం ఒకరు. ఆయన ఇక లేరు అనే వార్త యావత్ సంగీత ప్రేమికులను దిగ్బ్రాంతి కి గురి చేస్తుంది. కరోనా తో ఆగష్టు 4 న చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో చేరిన బాలు గారు కొద్ది సేపటి క్రితం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. కరోనా నుంచి కోలుకున్న ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా బాలు ఆసుపత్రి లోనే చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్యబృందం చికిత్స అందిస్తూ వస్తున్న ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. బాలు గారి మృతి తో చిత్ర పరిశ్రమ ఓ గొప్ప దిగ్గజ గాయకుడిని కోల్పోయింది.