కుమారుడు కర్ణాటక సంగీత కచ్చేరి చేస్తే వినాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే సాంబమూర్తి వెళ్ళిపోయారు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు కర్ణాటక సంగీత కచ్చేరి చెయ్యాలని ఎస్పీ బాలు తాపత్రయపడ్డారు. తండ్రి కోరిక మేరకు ఎప్పటికైనా కర్ణాటక సంగీతంలో కచ్చేరీ చెయ్యాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అది తీరకుండానే ఆయన కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.