"నా ఛిద్రమైన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ, నాకు బాసటగా నిలుస్తూ, జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి. నా ఆత్మబంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే" అని గాయని సునీత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గాయని సునీత బాధాతప్త హృదయంతో ఘటించిన నివాళి ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది.