ఎన్సీబీ ముందు విచారణకు హాజరైన కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ‘డ్రగ్ చాట్స్’ చేసినట్లు ఒప్పుకున్నారట. కానీ తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె వివరించిందని చెబుతున్నారు. రకుల్ నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురు సెలబ్రిటీలు ఎవరు, వారిలో టాలీవుడ్ వారు కూడా ఉన్నారా అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.