మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట  సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కానుంది. అందులో భాగంగా ఇప్పటికే మేకర్స్ యూఎస్ లో లొకేషన్స్ వేటలో ఉన్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో మొదలు కానుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చెయ్యాలని భావిస్తోందట చిత్రబృందం. షూటింగ్ స్టార్ట్ చేసిన రెండు మూడు నెలల్లోనే సగానికి పైగా సినిమాను చిత్రీకరించారలనీ చిత్రబృందం భావిస్తోందట.