ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే కాదు, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సినిమా పాటల్ని హీరోల వాయిస్ కి తగ్గట్టు పాడటంతోపాటు.. హీరోల మాటల్ని కూడా వారే మాట్లాడినట్టు డబ్బింగ్ చెప్పేవారు బాలు. దీంతో ఆయనతో ఏరికోరి డబ్బింగ్ చెప్పించుకునేవారు కొంతమంది స్టార్ హీరోలు. అది ఎంతవరకు వెళ్లిందంటే.. డబ్బింగ్ చెప్పలేను అని బాలు అంటే, నా సినిమాలు ఇక తెలుగులో విడుదల చేయను అని కమల్ హాసన్ అనే వరకు వెళ్లిందట.