ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “నా జీవితమంతా ఓ వింత ప్రయాణమే.! మొదట్లో నాకు సంగీతంపై ఏమాత్రం ఆసక్తి లేదు. ఇంజినీరు కావాలనుకున్నాను.. కానీ అనుకోకుండా గాయకుడినయ్యాను.సుమారు 20ఏళ్ల పాటు నేను సిగరెట్లు కాల్చాను. 40 ఏళ్ల కెరీర్లో రోజుకు 10 గంటలు పాటలు పాడేవాడిని.ఈ స్థాయికి రావడానికి నేను అంత కష్టపడ్డాను. నేను కొత్తవారిని తొక్కేశానని ఆరోపణలు కూడా వచ్చాయి.వాటిలో ఎంత మాత్రం నిజం లేదు. నా కెరీర్లో నేను ఎవ్వరికీ హాని తలపెట్టలేదు.  కొత్త ట్యాలెంట్ ఎక్కడున్నా వెతికి మరీ ప్రోత్సహించేవాడిని. నాకున్న పేరు ప్రతిష్ఠల వల్ల నా కొడుకు కెరీర్ కూడా సక్రమంగా కొనసాగడం లేదు. చరణ్‌ను ప్రతీ విషయంలోనూ నాతో పోల్చి చూడటం వల్ల వాడికి చాలా నష్టం జరుగుతుంది. సంగీతం అని, నటన అని, సినిమా నిర్మాణం అని చాలా తడబడ్డాడు. ఐదు సినిమాలు నిర్మించి ఇప్పటికే 11కోట్లు పోగొట్టుకున్నాడు” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.