తాజగా దిశా అనే సినిమా ని రూపొందించాడు రామ్ గోపాల్ వర్మ.. ఇటీవలే హైద్రాబాద్ లో జరిగిన ఓ అమానుష ఘటన కు ఈ సినిమా ప్రేరణ కాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశాడు వర్మ.. మాములు ప్రేక్షకులు చూడ్డానికే ఇబ్బంది పడేలా, బాధపడేలా ఉన్న ఈ ట్రైలర్ నిజమైన దిశ ఇంటి సభ్యులు ఈ ట్రయిలర్ చూస్తే గుండె ముక్కలయ్యేలా బాధపడరా అని వర్మ టార్గెట్ చేస్తున్నారు నెటిజన్స్.. అనవసరంగా మర్చిపోయిన గాయాన్ని రేపి మళ్ళీ మళ్ళీ బాధపడేలా చేయడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు..