తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోలెవరూ ఎస్పీ బాలు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. కరోనా భయం ఓవైపు, మరోవైపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఒక్కసారిగా చెన్నై వెళ్తే.. అక్కడ సెక్యూరిటీ ఇబ్బంది వస్తుందని, అందుకే వారు చెన్నై వెళ్లలేదని తెలుస్తోంది. ఏది ఏమయినా.. తెలుగు సినీ నేపథ్య గాయకుడు అని గర్వంగా చెప్పుకున్నా.. తెలుగు హీరోలెవరూ ఆయన అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు.