కేజీఎఫ్ సినిమాతో పాపులరైన ఫైట్ మాస్టర్లు అంబు-అరివు వేదాలం రీమేక్ కోసం చిరంజీవి పిలిపించారని అంటున్నారు. ఈ మధ్యనే ఈ జంట ఫైట్ మాస్టర్లు హీరో నాగశౌర్య చేస్తున్న సినిమాకోసం హైదరాబాద్ వచ్చారట. వీరికి చిరు టీమ్ నుంచి పిలుపు వచ్చిందట. హీరో చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కలసి ఫైట్ మాస్టర్లతో మాట్లాడారని, వేదాలం రీమేక్ కి వీరు ఫైట్స్ కంపోజ్ చేస్తామని చెప్పారని వార్తలొచ్చాయి.