గాయకుడిగా ప్రేమ పాటలు పడుతున్నప్పుడే సావిత్రితో బాలు ప్రేమలో పడ్డారు. పెద్దలకు విషయం చెప్పి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు బాలు. ఇద్దరిదీ ఒకే గోత్రం కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా, బాలూని ఇల్లు ఖాళీ చేయించారు అగస్తేశ్వరరావు. కుమార్తెను చెన్నై నుండి బెంగళూరు పంపించారు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. సావిత్రికి దూరం కావడంతో బాలు విరహ వేదనలో పడ్డారు. ఆయన పరిస్థితి చూసిన స్నేహితులు… బెంగళూరు నుండి సావిత్రిని తీసుకొచ్చారు. బాలూని, ఆమెను సింహాచలం తీసుకువెళ్లి అప్పన్న సాక్షిగా పెళ్లి చేశారు.