బాలీవుడ్ డ్రగ్స్ కేసు వివాదంపై సీనియర్ నటి పూజా బేడీ తీవ్రంగా స్పందించింది. పోలీసులు, ఎన్సీబీ అధికారుల తీరు చూస్తుంటే దేశంలో బాలీవుడ్ వాళ్లు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నట్లు ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మిగతా రంగాల్లో విపరీతంగా డ్రగ్స్(మాదక ద్రవ్యాల) వాడుతున్నా మీడియాకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంలో సంచలన అంశాలను మీడియా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని పూజా బేడీ ఆరోపించింది.